Tuesday, 31 March 2026 04:36:58 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu Naidu: రేపు నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదే!

Date : 09 October 2025 08:13 PM Views : 133

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రేపు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విశ్వసముద్ర ఎథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం వెంకటాచలం మండలం ఎడగాలిలో నంద గోకులం లైఫ్ స్కూల్‌కు శ్రీకారం నెల్లూరులో చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ప్రారంభం విద్యార్థులతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి సాయంత్రం తిరిగి విజయవాడకు పయనం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (అక్టోబరు 10) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక, విద్యా, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వివరాల్లోకి వెళితే, సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు అర్బన్‌లోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. చిరు వ్యాపారుల ప్రయోజనం కోసం 30 కంటైనర్లతో ఆధునికంగా తీర్చిదిద్దిన 120 షాపులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి వెళతారు. అక్కడ నూతనంగా నిర్మించిన నంద గోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడికి సమీపంలో ఉన్న గోశాలను సందర్శించి, నంది పవర్ ట్రెడ్‌మిల్ మిషన్‌తో పాటు 'నంద గోకులం సేవ్ ద బుల్' ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఎడగాలిలోనే ఏర్పాటు చేసిన 'విశ్వసముద్ర బయో ఎనర్జీ' ఎథనాల్ ప్లాంట్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని, సాయంత్రం 6:30 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి విజయవాడకు చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :