Wednesday, 25 June 2025 06:45:55 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ప్రదానం చాలా మంచి ఆలోచన... విద్యార్థుల ఆనందం

Date : 09 June 2025 05:27 PM Views : 75

Studio18 News - ANDHRA PRADESH / : పదో తరగతి, ఇంటర్మీయట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం చాలా మంచి ఆలోచన అని, దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అవార్డులు అందుకున్న పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం పట్ల వారు భావోద్వేగానికి గురయ్యారు. 1. ఇది చాలా మంచి ఆలోచన సాయి భువనకృతి వకుదావత్, పదో తరగతి విద్యార్థిని మార్కులు:594/600 పాఠశాల:నారాయణ స్కూల్, పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించాలనేది చాలా మంచి ఆలోచన. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో అదృష్టం ఉంటే తప్పితే ఇక్కడకు రాలేము. లోకేశ్ గారితో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఉంది. మా అమ్మగారు గుంటూరులో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. పార్వతీపురం ట్రాన్స్ ఫర్ చేస్తే చాలా బాగుంటుంది. నేను, మా చెల్లి, మా నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ విషయాన్ని లోకేశ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఉంది. షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వంద రోజుల యాక్షన్ ప్లాన్ వల్ల విద్యార్థుల్లో భయం పోయి కాన్ఫిడెన్స్ లెవల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దీనివల్ల పరీక్షల్లో మంచి స్కోర్ చేయగలిగాం. ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. 2. జనరల్ తో పాటు ఇంటర్ ఒకేషనల్ కూ ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు సింగ్ బంగారుతల్లి, ఇంటర్ ఒకేషనల్ విద్యార్థిని మార్కులు:901/1000 కాలేజీ:గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా నేను సాలూరు గవర్నెంట్ జూనియర్ కాలేజీలో ఓఏ ఓకేషనల్ కోర్సు చదివాను. జనరల్ గ్రూప్స్ వారితో పాటు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకూ ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రి నారా లోకేశ్ గారికి ధన్యవాదాలు. ఇంటర్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం వల్ల చదువుపై దృష్టిసారించే వీలు కలిగింది. దీంతో పాటు పుస్తకాలు, నాణ్యమైన బ్యాగ్ అందించారు. దీంతో బాగా చదవడానికి, ఉత్తీర్ణత పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నన్ను ప్రతిభ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్ లో బ్యాంక్ ఆఫీసర్ కావాలనేది నా కల. 3. పేదరికానికి, చదువుకు సంబంధం లేదని షైనింగ్ స్టార్స్ అవార్డ్ రుజువు చేసింది కరణం రోహిత్ కుమార్, ఇంటర్ విద్యార్థి మార్కులు:940/1000 కాలేజీ:శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజీ, సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. పేదరికానికి, చదువుకు సంబంధం లేదని షైనింగ్ స్టార్స్ అవార్డ్ రుజువు చేసింది. ఇలాంటి అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. భవిష్యత్ లో సీఎస్ఈ గ్రూప్ తీసుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. నూతన ఆవిష్కరణల ద్వారా దేశానికి నావంతుగా సేవచేస్తా. నూతన ఆవిష్కరణల ద్వారా పేదవారికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను. 4. లోకేశ్ గారు పార్వతీపురం వచ్చి వెన్నుదన్నుగా నిలవడం ఆనందంగా ఉంది వసంతల శ్రీనివాసరావు, ఇంటర్ విద్యార్థి తండ్రి విద్యార్థి మార్కులు:761/1000 కాలేజీ:శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజీ, సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా నా కుమారుడు దీక్షిత్ సాయి షైనింగ్ స్టార్స్ అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా కుమారుడికి దృష్టి లోపం ఉంది. స్క్రైబ్ సాయంతో ఇంటర్ పరీక్షలు రాశాడు. మంచి మార్కులు సాధించాడు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారు పార్వతీపురం వచ్చి వెన్నుదన్నుగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పారంటే చేస్తారంతే. మా అబ్బాయికి తొలిసారిగా అవార్డు వచ్చింది. ఇంకా బాగా చదువుకోవడానికి ఈ అవార్డ్ ఇన్ స్పిరేషన్. 5. ఉన్నత చదువులకు సాయం చేయాలి అలువూరి సంతోషి, పదో తరగతి విద్యార్థిని తల్లి విద్యార్థిని మార్కులు:576/600 పాఠశాల:జిల్లా పరిషత్ హైస్కూల్, మక్కువ పార్వతీపురం మన్యం జిల్లా మా పాప తనూజకు ఇలాంటి అవార్డు వస్తుందని అనుకోలేదు. లోకేశ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా భర్త మెకానిక్. నేను గృహిణిని. మా పాప ఉన్నత చదువులకు కూడా ఆర్థికసాయం చేయాలని కోరుతున్నాను.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :