Friday, 13 December 2024 08:14:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Vasireddy Padma: వైసీపీకి వాసిరెడ్డి ప‌ద్మ రాజీనామా.. జ‌గ‌న్‌పై మ‌హిళా నేత ధ్వ‌జం!

Date : 23 October 2024 01:21 PM Views : 37

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీకి మ‌రో భారీ షాక్ త‌గిలింది. మరో సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చెప్పారు. గ‌త కొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపారు. రాజీనామాపై వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్ ఈ సంద‌ర్భంగా వైసీపీకి రాజీనామా చేయ‌డంపై ఆమె మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. పార్టీలో త‌న‌తో పాటు చాలామందికి కొంత‌కాలంగా తీవ్ర అన్యాయం జ‌రుగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. ఇది త‌మ‌కే కాకుండా రాష్ట్ర ప్ర‌జానీకానికి జ‌రుగుతున్న మోసం, అన్యాయమ‌ని ఆమె పేర్కొన్నారు. దీన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంత‌వ‌ర‌కైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నార‌ని వాసిరెడ్డి ప‌ద్మ మండిప‌డ్డారు. జ‌గ‌న్ చేస్తున్న మోసాన్ని వ్య‌తిరేకించ‌డానికే తాను పార్టీ వీడుతున్న‌ట్లు తెలిపారు. తాను మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న స‌మ‌యంలో త‌న‌వంతు సాయం చేశాన‌న్న ఆమె.. జ‌గ‌న్ ప‌రిపాల‌న కాలంలో రాష్ట్ర మ‌హిళ‌ల‌కు స్వ‌ర్ణ‌యుగం అనుకుంటే అది చాలా పొర‌పాటు అని అన్నారు. ఆయ‌న హ‌యాంలో కూడా మ‌హిళ‌ల ప‌ట్ల ఎన్నో వికృత సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. అప్పుడు సీఎంగానీ, హోంమంత్రిగానీ ఎందుకు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేద‌ని వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌శ్నించారు. ఇప్పుడు రాజ‌కీయాలు చేయ‌డానికి మ‌హిళ‌ల‌ను అడ్డుపెట్టుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌ని ఆమె అన్నారు. జ‌గ‌న్‌ను 11 స్థానాల‌కు ప‌రిమితం చేసిన కోట్లాది మంది రాష్ట్ర ప్ర‌జ‌లు ఏ అభిప్రాయంతో ఉన్నారో.. ఇవాళ తాను అదే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఏకాకిని కాద‌ని, త‌న వెంట చాలామంది ఉన్నారని ఆమె తెలిపారు. జ‌గ‌న్‌పై తాను ఒంట‌రి పోరాటం చేయ‌డంలేద‌ని, సామూహిక పోరాటం చేయ‌బోతున్నాన‌ని అన్నారు. ప్రస్తుత ప్ర‌భుత్వంలో నేర‌స్తుల‌ను పట్టుకోవ‌డంలో పోలీస్ వ్య‌వ‌స్థ బాగానే ప‌ని చేస్తోందన్నారు. అయితే, అస‌లు నేరాలు జ‌ర‌గ‌కుండా ఒక పటిష్ఠ‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకోరావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. దీనికోసం సామాజికంగా కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని వాసిరెడ్డి ప‌ద్మ పిలుపునిచ్చారు. త‌న‌ను పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌ని కుట్ర జ‌రిగింద‌న్నారు. త‌న‌కు జ‌రిగిన తీవ్ర అన్యాయంపై పోరాటం చేస్తాన‌ని పేర్కొన్నారు. కానీ తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లవైపే త‌న అడుగులు అని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు