Friday, 13 December 2024 07:56:51 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Gudlavalleru: గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల వ్యవహారంపై ఐజీ కీలక ప్రకటన

Date : 06 September 2024 11:37 AM Views : 63

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రకంపనలు రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణల వ్యవహారంపై ఐజీ అశోక్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. హాస్టల్‌లో కెమెరాలు చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఆయన ప్రకటించారు. హిడెన్ కెమెరాలు, విద్యార్థినుల వీడియోల షేరింగ్‌ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐజీ అశోక్‌కుమార్‌ వివరించారు. 35 మంది విద్యార్థినులు, వార్డెన్లు, సిబ్బందిని ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవడంతో ఢిల్లీకి చెందిన సీఈఆర్‌టీ (కంప్యూటర్స్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ), పుణెలోని సీ-డాక్‌ టెక్నాలజీ నిపుణుల సాయం కూడా తీసుకున్నామని వివరించారు. విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నవారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని మూడు రోజులపాటు పరిశీలన, దర్యాప్తు చేశామని ఆయన చెప్పారు. కాలేజీలోని సెంట్రల్ సర్వర్‌తో పాటు హాస్టళ్లను, విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించామని అశోక్ కుమార్ వివరించారు. వివరాలు అన్నింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, 5 రోజుల్లో వివరాలు అందుతాయని ఐజీ పేర్కొన్నారు. సాక్ష్యాలతో ఎవరైనా ముందుకొస్తే దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఎస్పీ గంగాధర్‌‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ సంఘాల వారంతా అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారని, ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని ఐజీ అశోక్ కుమార్ వివరించారు. వారం రోజులపాటు సాగిన దర్యాప్తులో హిడెన్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్‌ జరగలేదని నిర్ధారణ అయిందని అన్నారు. కాగా హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలను అమ్ముకున్నారంటూ ఆగస్టు 29న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు నిరసనకు దిగారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు