Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Nara Lokesh Anna Canteen : టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేశ్ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ ను లోకేశ్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఆయనే స్వయంగా పలువురికి అల్పాహారంను వడ్డించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లను పున: ప్రారంభిస్తుంది. తొలి విడతలో భాగంగా 100 క్యాంటిన్లు ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలోని మరో 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నులకపేటలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. అన్న క్యాంటిన్లలో రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 35వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం 35వేల మందికి, రాత్రి మరో 35 వేల మంది భోజనం అందించనున్నారు.
Admin
Studio18 News