Saturday, 07 March 2026 08:47:26 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Nara Bhuvaneswari: ఏపీ ప్రభుత్వం ఏం చేయాలో అదే చేస్తోంది: నారా భువనేశ్వరి

Date : 02 September 2024 02:39 PM Views : 310

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రంలో వరద పరిస్థితులు, సీఎం చంద్రబాబు అహోరాత్రాలు సమీక్షలు చేపడుతూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తీరు పట్ల ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. ప్రకృతి విపత్తులను ఆపడం మన చేతుల్లో ఉండదని... కాకపోతే అలాంటి సమయాల్లో వేగంగా స్పందించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలు అందిస్తే... ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చని, బాధితులకు భరోసా కల్పించవచ్చని సూచించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే చేస్తోందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. "ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు గారు స్వయంగా బాధితుల వద్దకు వెళ్లారు. బాధితులకు ఆహారం, నీరు అందించి ధైర్యం చెప్పారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా తన వంతు సాయంగా రంగంలోకి దిగుతోంది. ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాను. దాంతోపాటే వాలంటీర్స్ తమ వంతు సహాయం చేయాలని అని కోరుతున్నాను" అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :