Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gossip Garage : అధికారంలో ఉన్నప్పుడు ఆయన హవానే వేరు. తాను గుర్తించినోడే లీడర్. ఆయన చెప్పిందే వేదం. పార్టీ క్యాడర్ కంటే..తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని మెయింటెన్ చేశారాయన. పార్టీ పవర్‌లో నుంచి దిగిపోయింది. ఆ నేత పదవి కూడా పోయింది. అప్పుడు నలిగిపోయిన నేతలంతా ఇప్పుడు గళమెత్తుతున్నారు. ఆ నేత తీరుపై ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ హైకమాండ్ కూడా ఆ మాజీమంత్రి మీద యాక్షన్‌కు రెడీ అయింది. నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచే తప్పిస్తారన్న టాక్ ఉంది. అదే నిజమైతే ఆ నేత వైసీపీలోనే ఉంటారా.. కూటమి పార్టీల వైపు చూస్తారా.? కొట్టు తీరు వల్లే తాడేపల్లిగూడెంలో ఓడామంటున్న నేతలు.. పవర్‌లో ఉన్నప్పుడు క్యాడర్‌ను పట్టించుకోలేదు. అధికారం కోల్పోయాక ఆ లీడర్‌ను క్యాడర్ పట్టించుకోవడం లేదు. పైగా అధికారంలోఉన్నప్పుడు ఆ నేత వ్యవహరించిన తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై తాడేపల్లిగూడెం వైసీపీ నేతలంతా మాజీ సీఎం జగన్‌కు కంప్లైట్ చేసినట్లు తెలుస్తోంది. కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు తిట్టేవారని, ఎవరినీ పట్టించుకోలేదని, కొట్టు తీరు వల్లే తాడేపల్లిగూడెంలో పార్టీ ఓడిందని చెప్పినట్లు టాక్. అవినీతి అక్రమాల కోసం ఓ వర్గాన్ని మెయింటైన్ చేశారని ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొట్టు సత్యనారాయణకు జగన్ షాక్ ఇవ్వనున్నట్లు చర్చించుకుంటున్నారు వైసీపీ లీడర్లు. తాడేపల్లిగూడెం సెగ్మెంట్‌కు మరో నేతను వైసీపీ ఇంచార్జ్‌గా నియమించబోతున్నారని తెలుస్తోంది. తాడేపల్లిగూడెం ఇంచార్జ్‌గా మరో నేత..? తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను పార్టీ బాధ్యతలు నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అధిష్టానం ఆయనకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసిన కొట్టు సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో లేరని.. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తాడేపల్లిగూడెం వైసీపీ ఇంచార్జ్‌గా వడ్డీ రఘురామ్‌ను నియమించేశారని..ఇక అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమన్న ప్రచారం జరుగుతోంది. కొట్టు.. పార్టీ మారతారా? తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. అందుకే ఆ సెగ్మెంట్‌కు ఏ పార్టీ నుంచి ఇంచార్జ్‌గా ఉండాలన్నా కాపు సామాజికవర్గ లీడర్ అయి ఉండటం మస్ట్. అందుకే ఏపీ ఆక్వా డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన వడ్డీ రఘురాంని ఇంచార్జ్‌గా నియమిస్తారని తెలుస్తోంది. అయితే కొట్టు సత్యనారాయణను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తే ఆయన వైసీపీలోనే కొనసాగుతారా లేక పార్టీ మారే ఆలోచన చేస్తారా అన్నది కూడా నియోజకవర్గంలో కొనసాగుతున్న చర్చ. ఐపాక్ టీం వల్లే ఓడామని కొట్టు స్టేట్‌మెంట్.. గతంలో పార్టీ ఓటమికి ఐపాక్ టీం కారణం అంటూ కొట్టు సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. కొంతమంది పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు కూడా అధికారం కోల్పోవడానికి రీజన్ అని బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడు ఆయనపై సొంత పార్టీ నేతల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో ఆయన చేసిన కామెంట్లపై అసంతృప్తిగా ఉన్న హైకమాండ్.. ఇప్పుడొచ్చిన ఫిర్యాదులతో వెంటనే నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యత నుంచి తప్పించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే కొట్టు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని పదవులకు పార్టీకి రాజీనామా చేయడంతో కొట్టు వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News