Wednesday, 10 December 2025 01:58:07 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Pinnelli: మరికాసేపట్లో జైలు నుంచి పిన్నెల్లి విడుదల

Date : 24 August 2024 12:48 PM Views : 329

Studio18 News - ANDHRA PRADESH / : ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అయితే, జైలు సమయం మించిపోవడంతో శుక్రవారం అధికారులు ఆయనను విడుదల చేయలేదు. నిబంధనల ప్రకారం ఈ రోజు విడుదల కానున్నారు. ఈ ఏడాది మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి విధ్వంసం సృష్టించారు. పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బందిని బెదిరించడం, రక్షణ ఏర్పాట్లలో ఉన్న పోలీసులపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు పిన్నెల్లికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :