Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రెండ్రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన విశాఖలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సెప్టెంబరు 25వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐఐ సదస్సులో పాల్గొంటారు. తన పర్యటన సందర్భంగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబును కలవనున్న కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు కూటమి ప్రభుత్వం ఇవాళ 99 మందితో నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వారు రేపు సీఎం చంద్రబాబును కలవనున్నారు. నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల చైర్మన్లు రేపు ఉండవల్లిలోని సీఎం నివాసానికి రావాలని పిలుపు అందింది. ఈ సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
Admin
Studio18 News