Tuesday, 31 March 2026 04:34:59 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu Naidu: ఏపీలో 2 లేన్ల జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చండి: సీఎం చంద్రబాబు ఆదేశం

Date : 29 January 2026 08:11 PM Views : 92

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఏపీలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష రోడ్ నెట్‌వర్క్ విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపుపై కీలక చర్చ ప్రాజెక్టుల అమలులో ఏపీ బెంచ్‌మార్క్‌గా ఉండాలని దిశానిర్దేశం 2-లేన్ల రహదారులను 4-లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన రాష్ట్రంలో రోడ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణమే ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి, రోడ్ డెన్సిటీ పెంపుదల వంటి కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతిని, కొత్తగా చేపట్టాల్సిన రహదారుల నిర్మాణం గురించి అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పనుల్లో నాణ్యత, వేగం పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ (NHAI)కు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :