Saturday, 07 March 2026 07:55:07 PM
# కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..? # గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా

గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు

Date : 30 December 2024 02:01 AM Views : 497

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అక్కడ టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిమెట్టు దగ్గర రోజూ 3 వేల టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ..ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అనేది భక్తుల ఆరోపణ.. కొందరు ఆటో డ్రైవర్లు.. తాము తీసుకువస్తున్న భక్తులకు సమయం తర్వాత వచ్చినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న వారిని కాదని.. దొడ్డిదారిన ఆటోవాలాలతో డీల్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్‌ చేయడంలోనూ, క్యూలైన్‌లలో ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో, ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదనేది భక్తుల మాట. వీకెండ్‌లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. శ్రీవారి మెట్టుమార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించినా ముందు వచ్చిన వారిని కాదని.. ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దళారులతో ఎదురయ్యే ఇబ్బందులు ఇలా ఉంటే.. అటు తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.. క్యూలైన్‌ MBC వరకు ఉంటోంది. శనివారం శ్రీవారిని 78 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 45 లక్షలు ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :