Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ఉన్నట్టుండి వెనక్కి వెళ్లాయి.. తీరం నుంచి సుమారు 50 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో బయటపడ్డ ఇసుకతో బీచ్ మరింత అందాన్ని సంతరించుకుంది. అయితే, ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం ఏ విపత్తుకు సంకేతమోనని స్థానికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం కాగా ఇటు సముద్రం మాత్రం వెనక్కి వెళ్లడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర తీరం వెంబడి ఎలాంటి గాలులు వీయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కోడూరు మండలం హంసలదీవిలోని పాలకాయథిప్ప బీచ్ వద్ద ఈ వింత చోటుచేసుకుంది.
Admin
Studio18 News