Saturday, 07 March 2026 09:17:15 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 'సాక్షి' కార్యాలయాలపై దాడులు అప్రజాస్వామికం: జగన్

Date : 10 June 2025 06:01 PM Views : 341

Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని, ఇది అప్రజాస్వామికం అని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇవి ప్రజాస్వామ్యంపై ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం జరుగుతున్న దాడులని ఆయన అభివర్ణించారు. సాక్షి టీవీ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ ను జగన్ ఖండించారు. సోమవారం నాడు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయగా, మంగళవారం గుంటూరులోని కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సాక్షి చానల్లో కొమ్మినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ కార్యక్రమంలో అమరావతి ప్రాంత మహిళలపై కించపరిచేలా మాట్లాడారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. అయితే, కొమ్మినేని ఎప్పుడూ అనని మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు వక్రీకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేయించారని జగన్ ఆరోపించారు. "మహిళల గౌరవాన్ని కాపాడే నెపంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ మూకలు పలు జిల్లాల్లోని సాక్షి యూనిట్ కార్యాలయాలను ధ్వంసం చేశాయి. ఇది మహిళల పట్ల ఆందోళనగా చిత్రీకరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు" అని జగన్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావిస్తూ, వారి నైతికతను ప్రశ్నించారు. "కోడలు అత్తగారిని కాకుండా భర్తనే ఇష్టపడుతుంది కదా అని మీరొకసారి అన్నారు. మీ బావమరిది అయితే అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్నారు. మహిళలను గౌరవించే విషయంలో ఇవి మీ ప్రమాణాలు!" అని జగన్ రాశారు. తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, బాలికలకు భద్రత, న్యాయం కల్పించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని మాజీ సీఎం ఆరోపించారు. అనంతపురంలో అదృశ్యమై, ఆ తర్వాత దారుణంగా హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి కేసులో అధికారులు సత్వర చర్యలు తీసుకోలేదని ఆయన ఉదహరించారు. అలాగే, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో 9వ తరగతి బాలికను 14 మంది ఆరు నెలలుగా బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేసినా పోలీసులు ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని ఎత్తి చూపారు. "కేవలం ఏడాది టీడీపీ పాలనలో 188 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయి, వారిలో 15 మంది హత్యకు గురయ్యారు. వేధింపులు, హింసకు సంబంధించిన వందలాది కేసులు శిక్ష పడకుండానే మిగిలిపోయాయి" అని జగన్ పేర్కొంటూ, ఇది శాంతిభద్రతల పూర్తి వైఫల్యమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రజా భద్రతను నాశనం చేసిందని కూడా ఆయన ఆరోపించారు. "ఓట్లు దక్కించుకోవడానికి ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ వంటి బూటకపు హామీలిచ్చారు, కానీ అధికారంలోకి వచ్చాక ప్రతీ హామీని మోసం చేశారు. ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని విఫలమైన, అవినీతిపరుడైన, అసమర్థ ముఖ్యమంత్రిగా చూస్తున్నారు" అని జగన్ విమర్శించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు, మీడియా మానిప్యులేషన్‌ను ఉపయోగించి అబద్ధాలు ప్రచారం చేస్తూ, ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని జగన్ ఆరోపించారు. "చంద్రబాబు గారూ, మీ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటికీ పనిచేయవు. ప్రజలు గమనిస్తున్నారు, వారు మిమ్మల్ని నిలదీస్తారు" అని ఆయన హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :