Thursday, 12 March 2026 03:50:07 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jogulamba Gadwal: హృదయవిదారక ఘటన.. ఓవైపు భర్త మరణం, మరోవైపు కుమారుడి జననం!

Date : 24 October 2024 01:48 PM Views : 466

Studio18 News - ANDHRA PRADESH / : తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త మృతి చెందిన గంటకు కుమారుడు జ‌న్మించాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన‌ ఒక గంట వ్యవధిలోనే అతడి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓవైపు తండ్రి మరణం మరోవైపు పుత్రుడి జననం.. ఇలా ఆ కుటుంబంతో విధి వింత నాటక‌మే ఆడింది. ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రం రాజోలికి చెందిన‌ శివ (26) కు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన లక్ష్మితో 14 నెలల కిందట వివాహమైంది. ఆమె గర్భం దాల్చ‌డంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. పెట్రోలుబంకులో పనిచేసే శివ‌ మంగళవారం సాయంత్రం రాజోలిలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. అత‌డు వెళ్తున్న బైక్ ఎస్సీ కాలనీ వద్ద అదుపు తప్పడంతో కింద‌ పడిపోయాడు. ఈ ప్ర‌మాదంలో అత‌ని తలకు తీవ్ర గాయాల‌య్యాయి. దాంతో శివ‌ను కుటుంబ స‌భ్యులు రాత్రి 8 గంటల స‌మ‌యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా మంగళవారం రాత్రే లక్ష్మికి పురిటినొప్పులు రావ‌డంతో ఆమెను రాత్రి 10 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించారు. ఈ క్ర‌మంలో బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో శివ చ‌నిపోయాడు. కానీ, అదే ఆసుప‌త్రిలో ఉన్న‌ లక్ష్మికి కుటుంబ స‌భ్యులు ఈ విష‌యం చెప్ప‌లేదు. ఆ త‌ర్వాత వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. తండ్రి చ‌నిపోయిన సుమారు గంటకు ఆ పసివాడు కళ్లు తెరిచాడు. మ‌గ‌బిడ్డ పుట్టిన ఆనందాన్ని అనుభవించకుండానే శివ మృతిచెంద‌డంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :