Tuesday, 17 September 2024 12:34:48 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Krishna river: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ .. ఆయా ప్రాంతాల ప్రజల అప్రమత్తం!

Date : 08 August 2024 11:40 AM Views : 39

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నాగార్జున సాగర్, పులిచింతలకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుల నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకున్నాయి. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 3,19,408 క్యూసెక్కులు కాగా, దిగువకు 2,89,356 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల నిండు కుండలా మారింది. పులిచింతలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరాం తాతయ్య కలిసి బుధవారం 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు నేతలు పూజలు చేసి, జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. పులిచింతల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా గురువారం ఉదయానికి 167.94 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, 35.5 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు గురువారం ఉదయానికి ఇన్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా ఉండగా, అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుండి కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీకి పరుగులు పెడుతోంది. భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో ..2,67,111 క్యూసెక్కులు ఉండగా, కాలువలకు 13,991 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. ఇక బ్యారేజీ 60 గేట్లు అరు అడుగుల మేర, పది గేట్లు అయిదు అడుగుల మేర ఎత్తి .. 2,53,120 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :