Monday, 02 December 2024 12:32:12 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: విజయవాడ వరదల వల్ల పాడైన వాహనాల యజమానులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!

Date : 09 September 2024 02:43 PM Views : 36

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడ వాసులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వరదల్లో దెబ్బతిన్న, మునిగి పాడైన వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పాడైన ఇంట్లోని ఉపకరణాల ఖర్చులోనూ కొంత భరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాదిమందికి లబ్ధి జరగనుంది. గత రాత్రి విజయవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వాహన కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు వరదల కారణంగా బైక్‌లు, ఆటోలు, కార్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నింటికి బీమా ఉండగా, బీమా లేని వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అసలు వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఇది అదనపు ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ముందుకొచ్చి మరమ్మతులు చేయించి ఇవ్వాలని నిర్ణయించింది. రిపేరుకు తక్కువ మొత్తం అయితే ప్రభుత్వమే భరించాలని, ఎక్కువ అయితే మాత్రం కొంత వాటి యజమానులు కూడా భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరమ్మతు పనుల కోసం ఆయా వాహన తయారీదారులతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే, వారి వద్ద సీఎస్ఆర్ నిధులు ఉంటాయి కాబట్టి వాటితో ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాలని కోరుతోంది. అర్బన్ కంపెనీకి పనులు వరదల కారణంగా దెబ్బతిన్న ఇంట్లోని ఎలక్ట్రిక్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్‌కు సంబంధించిన మరమ్మతు పనులను ‘అర్బన్ కంపెనీ’కి అప్పగిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వస్తుందని, అనంతరం కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే, నష్టపోయిన వ్యాపారుల విషయంలోనూ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు