Saturday, 14 December 2024 03:21:10 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: ఇవాళ నా పాత స్నేహితుడితో సమావేశం గొప్పగా జరిగింది: సీఎం చంద్రబాబు

Date : 16 August 2024 03:09 PM Views : 50

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ టాటా సన్స్ ప్రతినిధి బృందంతో సమావేశం కావడం తెలిసిందే. దీనిపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "అమరావతిలో ఇవాళ నా పాత స్నేహితుడు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో సమావేశం గొప్పగా జరిగింది. ఆర్థికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047ని దృష్టిలో ఉంచుకుని మేధావులు, పారిశ్రామిక దిగ్గజాలు సభ్యులుగా ఏపీ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ టాస్క్ ఫోర్స్ కు నటరాజన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్ గా వ్యవహరిస్తారని సంతోషంగా ప్రకటిస్తున్నాను. అంతేకాదు, అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటీటివ్ నెస్ (జీఎల్ సీ)లో భాగస్వామిగా ఉండేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. ఇక, విశాఖలో టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు గల అవశాలపై కూడా నేటి సమావేశంలో చర్చించాం. ఏపీని ఇతర ప్రాంతాలతో మరింతగా అనుసంధానించేలా ఎయిరిండియా, విస్తారా విమానయాన సేవల విస్తరణ పైనా... వివిధ రంగాల్లో భాగస్వామ్యంపైనా చర్చించాం" అని చంద్రబాబు వివరించారు. కాగా, ఈ సమావేశంలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు