Studio18 News - ANDHRA PRADESH / : TG Venkatesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమనే కాదు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని అన్నారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు, తాగు ప్రాజెక్టులు త్వరలో పూర్తికానున్నాయి. పెన్నా – గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నాడని, సిద్దేశ్వరం బ్యారేజ్ ను ఐకాన్ బ్రిడ్జ్ గా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలి. లేనిదానికోసం పాకులాడకూడదు. విభజన హామీలు వచ్చేవాటిపై కామెంట్స్ చేస్తే మనకే నష్టం అని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ను అణచి వేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ కొనియాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రధాని మోదీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి. మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. మదనపల్లి దగ్దం కేసులో చట్టం తనపని తాను చేస్తోంది. తప్పుచేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు. ఒకటిన్నర నెలకే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్డీయే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. జగన్ చేష్టలతో ప్రజల్లో ఉన్నకాస్త విశ్వాసాన్ని కోల్పోతాడని మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు.
Admin
Studio18 News