Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో వరద బీభత్సం పట్ల టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చలించిపోయారు. ఈ క్రమంలో ఆయన వరద బాధితులకు సాయం చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతితో కలిసి విజయవాడలో సీఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘనవిజయం సాధించగా... ఆయన భార్య ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.
Admin
Studio18 News