Wednesday, 10 December 2025 02:50:08 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Dowleswaram Barrage : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు.. వీడియో వైరల్

Date : 21 July 2024 12:34 PM Views : 458

Studio18 News - ANDHRA PRADESH / : Dowleswaram Barrage : తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.2 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుంది. బ్యారేజ్ నుంచి 5లక్షల9వేల క్యూసెక్కుల మిగులు జలాలను బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. అయితే, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద బోటు ఇరుక్కుపోయింది.దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకుపోయింది. బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య బోటు ఇరుక్కుపోయింది. బోటును బయటకు తీసేందుకు ఇరిగేషన్ సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో బోటును బయటకు తీయడం కష్టతరంగా మారుతుంది.ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది. దీంతో గండి పోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో రాకపోకలు స్తంభించాయి. వరద ఉద్ధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురైంది. జాతీయ రహదారిపై వరద చేరికతో ఒడిశా – ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉద్ధృతి కారణంగా భద్రాచలం – చింతూరు, కూనవరం – భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :