Sunday, 08 February 2026 10:55:59 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

సరిగ్గా 20ఏళ్ల తర్వాత.. బుడమేరు దెబ్బకు మునిగిన విజయవాడ.. ఇది ఎవరి పాపం?

Date : 03 September 2024 05:18 PM Views : 317

Studio18 News - ANDHRA PRADESH / : Budameru Floods : విజయవాడ జలవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా నీటితో నిండిన బెజవాడ సముద్రాన్ని తలపిస్తోంది. విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు ఇంతలా ఉగ్రరూపం దాలుస్తుందని ఎవరూ ఊహించలేదు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతలం అవుతున్నారు. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని బుడమేరు నిరూపించింది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్దాంతరంగా నిలిచిపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని చెబుతున్నారు. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణా నది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముంపు ప్రమాదం పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. 2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే ఇందుకు కారణమైంది. రికార్డ్ స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో విజయవాడను ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్ లో గరిష్టంగా 11 వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగులేటర్ ను 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ప్రవేశిస్తుంది. 2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు వైఎస్ఆర్ కు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దాన్ని మళ్లించడం ఒక్కటే మార్గం అని భావించారు. పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువున పోలవరం కుడి కాలువ కృష్ణా నదిలో గుర్తించి అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని అధికారులకు అప్పటి సీఎం వైఎస్ఆర్ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :