Saturday, 07 March 2026 08:58:20 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు.. పూర్తి వివరాలు వెల్లడించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్

Date : 10 August 2024 06:00 PM Views : 395

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టు వివరాలను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హౌరా-చెన్నై రైల్వే కారిడార్ అనేక రాష్ట్రాలను కలుపుతుందని తెలిపారు. ఈ కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించామని, విజయనగరం వరకు 3వ లైన్ నిర్మాణం ఆమోదం పొందిందని చెప్పారు. మొత్తంగా 4 లైన్ల కారిడార్ నిర్మించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. అసన్‌సోల్ (బెంగాల్) – వరంగల్ వరకు కలిపేలా సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జునాగఢ్ – నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వై లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయని తెలిపారు. రూ.7,383 కోట్ల ఈ రెండు ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడంలో ఈ కారిడార్లు చాలా ఉపయోగకరంగా మారతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బొగ్గును నేరుగా తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు చేరుకుంటుందని చెప్పారు. ఈ కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుందని తెలిపారు. తెలంగాణలో 19.7, ఏపీలో 85.5 కి.మీ దూరం ఈ ప్రాజెక్టులో కవర్ అవుతోందని చెప్పారు. గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగనుందని తెలిపారు. కోస్తా ఏరియాలో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఈ కారిడార్ సరకు రవాణాకు కీలకంగా మారుతుందని అన్నారు.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మీదుగా ఈ లైన్ సాగుతుందని చెప్పారు. ఆ ప్రాంతం అభివృద్ధికి ఈ మార్గం కీలకంగా మారనుందని తెలిపారు. ఈ మార్గంలో టన్నెల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్‌పై సీఎంతో మాట్లాడానని తెలిపారు. తమకు కేటాయించిన స్థలం నీరు నిలిచే ప్రాంతమని, కొత్తగా వేరే భూమి ఇవ్వాలని కోరామని, ఆ ఏర్పాట్లలో రాష్ట్రం ఉందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :