Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నందమూరి బాలకృష్ణ ఒక పక్క ప్రజా ప్రతినిధిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క సినీమా షూటింగ్ లలోనూ బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బాలయ్య వరుసగా మూడోసారి హిందూపురం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బాలయ్య కొంత సమయాన్ని రాజకీయాలకు, మరికొంత సమయాన్ని సినిమాలకు కేటాయిస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంటారు. అయితే తాజాగా ఆయన హిందూపురంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించారు. అటు సినిమాల్లో, ఇటు నిజ జీవితంలో ఏ వాహనాన్ని అయినా నడిపే బాలయ్య .. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా స్టీరింగ్ పట్టి బస్సును కొద్ది దూరం నడిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ సమక్షంలో బాలకృష్ణ నేరుగా బస్సు డ్రైవింగ్ చేయడంతో అధికార యంత్రాంగం, తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి కొత్త బస్సులు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత కూడా పాల్గొన్నారు.
Admin
Studio18 News