Thursday, 05 December 2024 09:38:28 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు

Date : 16 September 2024 02:48 PM Views : 46

Studio18 News - అంతర్జాతీయం / : చైనాను మరో తుపాన్ వణికిస్తోంది. మొన్నటి వరకు హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాన్ ఇబ్బంది పెట్టగా.. ఆదివారం నుంచి బెబింకా టైపూన్ బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా షాంఘై నగరాన్ని ఓ తుపాన్ నేరుగా తాకిందని అధికారులు చెబుతున్నారు. గంటకు 151 కి.మీ. వేగంతో సిటీని తాకిందన్నారు. బెబింకా ప్రభావంతో ఈదురుగాలులు వీస్తుండడం, వర్షం కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. షాంఘైలోని రెండు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. రైళ్లు, బస్సుల రాకపోకలు కూడా నిలిపివేసినట్లు తెలిపింది. టైపూన్ ప్రభావంతో భారీ వర్షం, పెనుగాలులు వీస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు పార్కులు, వినోద ప్రదేశాలను అధికారులు క్లోజ్ చేశారు. షాంఘై నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అత్యంత అరుదని అధికారులు తెలిపారు. చివరిసారి 1949లో టైపూన్ గ్లోరియా తర్వాత మళ్లీ ఇప్పుడు బెబింకా టైపూన్ ఈ సిటీని అల్లకల్లోలం చేస్తోందని వివరించారు. టైపూన్ కారణంగా ఆదివారం రాత్రి నుంచి విమానాశ్రయాలను మూసేశామని, వందలాది విమానాలను రద్దు చేశామని చెప్పారు. ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాను ఇబ్బందిపెట్టింది. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :