Monday, 08 December 2025 04:30:20 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Nara Lokesh: డోంట్ వర్రీ అమ్మా... నేను చూసుకుంటా: ఒమన్ లో కష్టాలు పడుతున్న మామిడి దుర్గకు మంత్రి నారా లోకేశ్ భరోసా

Date : 25 July 2024 06:03 PM Views : 271

Studio18 News - ANDHRA PRADESH / : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారు తిరిగి రాలేక, అక్కడ ఇమడలేక అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు తమ గోడును వీడియోల రూపంలో వెళ్లబోసుకోగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇటీవలే చొరవ చూపి కువైట్ నుంచి శివ అనే కార్మికుడిని స్వస్థలానికి రప్పించారు. తాజాగా, మామిడి దుర్గ అనే యువతి కూడా ఇదే రీతిలో ఒమన్ లో చిక్కుకుపోయి ఆరోగ్య బాగాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏజెంట్ చేతిలో మోసపోయానని, ఆరోగ్యం దెబ్బతిన్నదని, తనను స్వస్థలానికి చేర్చాలంటూ నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆ వీడియోలో మామిడి దుర్గ కన్నీటిపర్యంతమైంది. మామిడి దుర్గ పరిస్థితి పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "ఇక నువ్వు బాధపడొద్దమ్మా... నేను చూసుకుంటాను. ఇప్పుడే నీ విషయాన్ని ఎన్నారై టీడీపీ వాళ్లకు వివరిస్తాను. వాళ్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిన్ను కాపాడతారు. వీలైనంత త్వరలో నిన్ను స్వస్థలానికి చేర్చే ఏర్పాట్లు చేస్తారు' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మామిడి దుర్గ వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :