Saturday, 24 January 2026 02:18:21 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

15 వేల కోట్లు ముష్టి పడేస్తే పండగ చేసుకోవాలా?: కేంద్ర బడ్జెట్‌పై వైఎస్ షర్మిల ఫైర్

Date : 23 July 2024 05:23 PM Views : 292

Studio18 News - ANDHRA PRADESH / : YS Sharmila on Union Budget 2024: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఎన్నికల మ్యానిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్ 1200 పాయింట్స్ పడిపోయిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ”పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదని అని నిర్మలా సీతారామన్ చెప్పారు. 12 వేల కోట్లు పునరావాసానికి అవసరం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎంత డబ్బులు కేటాయించారు.. పునరావాసం పరిస్థితి గురించి బడ్జెట్‌లో ఒక్క మాట చెప్పలేదు. కర్నూల్, కోపర్తి దగ్గర ఇండ్రస్ట్రీ హబ్‌కి ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్ అంటే అంకెలకి సంబంధించిన అంశం. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు.. కానీ ఇంత ఇస్తారనేది ఎక్కడా చెప్పలేదు. అసలు కేంద్రం ఎంత ఇస్తుందో టీడీపీ, జనసేనకి తెలుసా? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి అత్యంత కీలకం.. కానీ దాని గురించి బడ్జెట్‌లో ఒక్క మాట లేదు. ప్రత్యేక హోదా ఇవ్వదలచుకోలేదా? ఆ విషయం చెప్పగలరా? ఉభయ సభల్లో ప్రత్యేక హోదా అప్రూవ్ అయ్యింది.. కానీ బీజేపీ ఒక్క మాట మాట్లాడం లేదు. బిహార్‌కి ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది.. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? బిహార్‌కి ఇస్తారో లేదో అది బీజేపీ ఇష్టం.. కానీ ఆంధ్రప్రదేశ్‌కిఇచ్చి తీరాలి. ప్రత్యేక హోదా లేకపోతే ఇండ్రస్ట్రీలు ఎందుకు వస్తాయి? 15 వేల కోట్లు ముష్టి పడేస్తే మేము పండగ చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? టీడీపీ 16 మంది ఎంపీలు ఒక్కొక్కరినీ వెయ్యి కోట్లకు బీజేపీ కొనుక్కున్నాట్టా? ఇదెక్కడి న్యాయమని అగుతున్నాను.విభజన చట్టంలోని మిగతా హామీల సంగతేంటి.. రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ.. వీటన్నింటికీ నిధులు అవసరం లేదా? విజయవాడ, విశాఖలో మెట్రోరైళ్లు అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్‌కి 10 ఏళ్లు మోసం చేసిన మోదీతో బాబు జాతకట్టారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు అన్నారు.. ఇప్పుడు మళ్లీ 3 కోట్ల ఇళ్లు అంటున్నార”ని షర్మిల మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :