Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులను కలిశారు. అందరినీ పేరుపేరునా పలకరించారు జగన్. ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి తమ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీలో దీక్ష చేశారు. అనంతరం జగన్ బెంగళూరుకు కూడా వెళ్లి వచ్చారు.
Admin
Studio18 News