Studio18 News - ANDHRA PRADESH / : విజయనగరంలో ప్రతి ఏడాది పైడితల్లి అమ్మవారి జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జాతరకు హాజరవుతారు. త్వరలోనే పైడితల్లి అమ్మవారి జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరకు హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఆహ్వానపత్రం అందించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ... పైడితల్లిని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి దర్శించుకున్న రోజునే చంద్రబాబుకు బెయిల్ లభించిందని చెప్పారు. విజయవాడ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఎంతో అంకితభావంతో సేవ చేశారని... ఆయన సేవలకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందని అన్నారు. టెక్నాలజీ సహకారంతో విపత్తులను ఎలా ఎదుర్కోవచ్చో చంద్రబాబు చేసి చూపించారని కొనియాడారు.
Admin
Studio18 News