Monday, 02 December 2024 01:28:47 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద... 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

Date : 06 August 2024 11:45 AM Views : 37

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల డ్యామ్ ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3.93 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జలవిద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి, దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు 64,338 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు