Tuesday, 23 July 2024 03:51:05 AM
# ఆ ఫాంహౌస్‌ని జేసీబీలతో కూల్చివేసిన మునిసిపల్ అధికారులు # ఆ సమయంలో ఆ ఉద్యోగి ఎందుకు వెళ్లాడు? మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం # ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోం.. పెద్దిరెడ్డిపై అనుమానాలు: మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని # Maddali Giri: వైసీపీకి రాజీనామా చేసిన మద్దాళి గిరి # Heavy Rains: మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు... భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక # Software- Autodriver: వీకెండ్స్‌లో ఆటో డ్రైవ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ ఇంజనీర్.. సామాజిక సంబంధాల విలువను తెలియజేసే ఘటన ఇదీ! # Nagarjuna Yadav: డీజీపీ గారూ... గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?: వర్ల రామయ్య # PR Sreejesh : 14 ఏళ్ల కెరీర్‌.. పారిస్ ఒలింపిక్స్‌తో ముగింపు.. టీమ్ఇండియా హాకీ స్టార్ పీఆర్ శ్రీజేశ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. # శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక # Viral Video: నలుపు రంగు దుస్తులు వేసుకువచ్చి.. నల్లని పెయింట్ స్ప్రే చేసి వెళ్లిన యువకుడు # sixes ban : అల‌ర్ట్‌.. క్రికెట్‌లో కొత్త రూల్‌.. సిక్స్ కొడితే ఔట్‌.. బ్యాట‌ర్లకు అక్క‌డ క‌ష్ట‌కాల‌మే..! # Team India: కొత్త కోచ్ గంభీర్ తో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరిన టీమిండియా # Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు # Smita Sabharwal: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదు: హరీశ్ రావు # Operation Raavan : సినిమా మొదలయిన గంటలో విలన్‌ని కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము.. వెయ్యి మందికి బంపర్ ఆఫర్.. # Madanapalle: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మదనపల్లె చేరుకున్న డీజీపీ, సీఐడీ చీఫ్ # KTR: కొత్త న్యాయ చట్టాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ # Bihar: బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం # భయం.. భయం.. భయం.. అంటూ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ # జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీలోని పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు లేఖ

ఏపీలోని పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు లేఖ

Date : 29 June 2024 12:37 PM Views : 48

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లు చూసి చలించిపోయానన్న బాబు ఏ ఆకాంక్షలతో మీరు ఓటేసి గెలిపించారో వాటిని నెరవేర్ఛడమే మా తక్షణ కర్తవ్యమని వెల్లడి మాటిచ్చినట్లే పెంచిన పింఛన్ మీ ఇంటివద్దనే అందిస్తామన్న సీఎం

Also Read : నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు.. లడఖ్ లో ఐదుగురు సైనికుల మృతి

‘ఏ ఆకాంక్షలతో మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ, ప్రథమ కర్తవ్యం..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవడానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పెంచిన పింఛన్ ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తాజాగా జులై 1న రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.3000 పెంచి ఇక నుంచి రూ.6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మూడు నెలలకు పెంచిన రూ.3000, జులై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తామని అన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని చెప్పారు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలనెలా అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చినట్లు వివరించారు. 'పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తాయని ఆశిస్తున్నాము. ప్రజా భద్రత మా బాధ్యత. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నా'నని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ADVT :-

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :