Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడను వణికించిన వరద ఉద్ధృతి తగ్గుతున్న వేళ మళ్లీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం 1.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. బుడమేటి వరద నిలకడగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. బుడమేటి కాల్వ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బుడమేటికి పడిన గండ్లలో రెండు చోట్లా పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు మంత్రులు పర్యటించనున్నారు. బాధితులకు అందే సహాయ సహకారాలను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. బాధితులకు సాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి దాతల ద్వారా విజయవాడకు ఆహారం వస్తోంది. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారాన్ని అధికారులు తరలిస్తున్నారు.
Admin
Studio18 News