Studio18 News - ANDHRA PRADESH / : విద్యారంగ సమస్యలు పరిష్కరించి, నీట్, పరీక్షల లీకుకు కారకులైన ఎన్.టిఎ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా విద్య సంస్థల బంద్ చేపట్టారు. కడప జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు బంద్ నిర్వహించారు. అనంతరం బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరత్తించారు. పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసి, దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని పేర్కొన్నారు. యూనివర్సిటీ కేంద్రాలలో విద్యార్థులపై అక్రమ కేసులు ఆపాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు...
Also Read : kadapa : ఎర్రచందనం అక్రమ రవాణాపై నజర్
ADVT
Admin
Studio18 News