Studio18 News - ANDHRA PRADESH / : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లనున్న జగన్ గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు జరుగుతున్నాయని, హత్యలు, దాడి ఘటనలు, విధ్వంసాలు చోటుచేసుకుంటున్నాయని గవర్నర్ కు తెలుపనున్నారు. వినుకొండ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలను ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం వంటి ఘటనలపై గవర్నర్ కు సాక్ష్యాలను, వీడియోలను అందజేయనున్నారని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.
Admin
Studio18 News