Sunday, 08 March 2026 04:33:08 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

TDP Leaders: పార్లమెంట్ కీలక కమిటీల్లో టీడీపీ ఎంపీలకు చోటు

Date : 06 August 2024 03:04 PM Views : 330

Studio18 News - ANDHRA PRADESH / : ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరడంతో ఆ పార్టీ నేతలకు కేంద్రంలో ప్రాముఖ్యత పెరిగినట్లుగా కనబడుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండగా, తాజాగా, ఐదుగురు టీడీపీ ఎంపీలకు పార్లమెంట్ కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటు దక్కింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అంచనాల కమిటీలో పార్ధసారధి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే టీడీపీకి ఒక మంత్రిత్వ శాఖ స్థాయూ సంఘం చైర్మన్ పదవి కూడా లభించే అవకాశం ఉందని టాక్ నడుస్తొంది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ చంద్రబాబు, నితీశ్ పై ఆధారపడి ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ ఇద్దరు నేతలు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందని అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :