Wednesday, 30 April 2025 03:20:21 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

సబ్జెక్టు డైవర్షన్‌లో చంద్రబాబు ఎక్సపర్ట్.. ఫైల్స్ తగలబెట్టారని తప్పుడు ప్రచారం: వైఎస్ జగన్

Date : 26 July 2024 02:18 PM Views : 135

Studio18 News - ANDHRA PRADESH / : YS Jagan Preessmeet: ప్రశ్నించే వారిని అణిచివేసే ధోరణిలో ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం 52 రోజులుగా రివర్స్ డైరెక్షన్ లో పోతుందని.. హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం, దాడులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలు అమలు చెయ్యాల్సివస్తుందని రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం లేదన్నారు. హామీల గురించి ప్రజలు అడుగుతారనే హత్యలతో భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. ”వంచన, గ్లోబల్స్ ప్రచారం ఈ రెండే చంద్రబాబు ఫాలో అవుతాడు.. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పి హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పులు అని అపార్థాలు చెప్పించారు. ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలు పంపిస్తా. ఆర్బీఐ, కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే. 2014-19 మధ్యలో రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థికంగా ధ్వంసం చేశాడు. దేశ చరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు హామీలను ఎగ్గొట్టడానికి ఆర్థిక ధ్వంసం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2019లో మేము అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్ర ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లే. అలాంటి అధ్వాన పరిస్థితుల్లోనూ మేము పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టాం. బడ్జెట్ లో హామీల అమలు కేటాయింపులు, అప్పులు వివరాలు చెప్పాం. ఆర్ధిక ఇబ్బందుల్లోనూ క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేశాం. DBT ద్వారా 2.71 లక్షల కోట్లు నేరుగా పథకాలు అమలు చేశాం. మా ప్రభుత్వం దిగిపోయే సరికి రాష్ట్ర ఖజానాలో రూ. 7 నుంచి 8 వేల కోట్లు ఉన్నాయి. దేశ చరిత్రలో ఇలా 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఎక్కడా జరగలేదు. పెద్దిరెడ్డి కాల్చేశారని తప్పుడు ప్రచారం సబ్జెక్టు డైవర్షన్‌లో చంద్రబాబు ఎక్సపర్ట్.. వినుకొండలో మా కార్యకర్త హత్య జరిగితే నేను పరామర్శకు వెళ్లా.. అదే రోజు మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ కాలిపోతే హడావిడి చేశారు. ఏకంగా డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ కాలిపోతే అవన్నీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి, ఆన్‌లైన్‌లోనూ ఉంటాయి. అక్కడెక్కడో ఫైల్స్ కాలిపోతే పెద్దిరెడ్డి కాల్చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై వాళ్ళే దాడులు చేస్తున్నారు.. కేసులు వాళ్లపైనే కేసులు పెడుతున్నారు. నా పర్యటనను డైవర్ట్ చెయ్యడానికి హెలికాప్టర్ ఇచ్చి పంపిన చంద్రబాబు మచ్చుమర్రిలో బాలికపై హత్యాచారం జరిగితే ఎందుకు పంపలేదు? 45 రోజుల్లో 12 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయి. మా పాలనలో దిశా చట్టం, దిశా యాప్ ద్వారా మహిళలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాం. జగన్‌కు క్రెడిట్ వస్తుందని దిశా యాప్, పోలీస్ స్టేషన్‌లను పక్కన పెట్టేశారు. ప్రజలకు ఏం మేసేజ్ పంపుతున్నారు? పల్నాడులో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ హోర్డింగ్స్ పెట్టారు. ఈ హోల్డింగ్స్ ద్వారా ప్రజలకు ఏం మేసేజ్ పంపుతున్నారు? ఈ హోర్డింగ్స్ చూసి లోకల్‌గా ఎవరి రెడ్ బుక్ వాళ్లు అమలు చేస్తున్నారు. నేను ఢిల్లీలో ఉండగానే పెదకూరపాడులో మా నేత కాళ్లు చేతులు నరికేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన అనేలా ఉంది. ఈ అరాచక పాలనపై ప్రజల్లో చర్చ మొదలైంది. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? జగన్ ఉంటే ఈపాటికి అమ్మవడి ఎప్పుడో వచ్చేది. బడులు తెరిచి నెల అయినా 15 వేలు రాలేదు. తల్లికి వందనం అని పేరు పెట్టి డబ్బులు ఇవ్వకుండా తల్లులకు శఠగోపటం పెట్టారు. డేటా డేటా అని రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా పిల్లలు ఉన్నారు వారందరికీ తల్లికి వందనం ఇవ్వండి. జగన్ ఉంటే ఈపాటికి రైతు భరోసా వచ్చేది.. అది కూడా ఎగ్గొట్టారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్స్యూరెన్స్ డబ్బులు కట్టడం లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, వసతి దీవెన ఎగోట్టారు. 1.80 కోట్ల మంది మహిళలు నెలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని నిరుద్యోగులు అడుగుతున్నారు. జగగ్‌నే అధికారంలో ఉండి ఉంటే అన్ని సక్రమంగా జరిగేవి అని ప్రజలు అనుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా శ్వేతపత్రాలతో కాలయాపన చేస్తున్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పులు చేశాడు. ఆ తప్పులు వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుని పోయింది. కేంద్రంతో కట్టించకుండా రాష్ట్రానికి తీసుకోవడమే చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే.. రాష్ట్రానికి తీసుకుని తప్పు చేశాడు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి సొంత వాళ్లకి కాంట్రాక్టులు ఇచ్చి ఈ పరిస్థితికి తీసుకుని వచ్చాడు. తాను చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి మాపై నిందలు వేస్తున్నాడ”ని వైఎస్ జగన్ విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :