Thursday, 12 March 2026 12:16:53 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

TDP Parilamentary Meeting: ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనమేం చేయాలనేదే ముఖ్యం: టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు

Date : 20 July 2024 06:12 PM Views : 397

Studio18 News - ANDHRA PRADESH / : సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సి నిధుల కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించారు. కేంద్రంతో సమన్వయం కోసం ఇప్పటికే ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించామని, ఆ దిశగా ఎంపీలు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలు రాష్ట్రమంత్రులను వెంటబెట్టుకుని వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని చంద్రబాబు సూచించారు. విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన అంశాలపైనా నేటి సమావేశంలో చర్చించారు. కాగా, ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనం ఏం చేయాలనేదే ముఖ్యం అని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :