Monday, 02 December 2024 02:03:57 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Visaka Steel Plant: నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక భేటీ ..విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై సర్వత్రా ఉత్కంఠ

Date : 10 September 2024 04:21 PM Views : 60

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఢిల్లీలో ఈరోజు (మంగళవారం) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ తరుణంలో ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో సమావేశంలో ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి .. 45 రోజుల్లో అన్నీ చక్కదిద్దుకుంటాయని, ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని కార్మికులకు భరోసా ఇచ్చారు. అయితే స్టీల్ ప్లాంట్ సీఎండీగా ఉన్న అతుల్ భట్ ను అర్ధాంతరంగా విధులను తప్పించి, రిటైర్ మెంట్ వరకూ సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని చెబుతూనే కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్లాంట్ లో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు మొదలవడంతో ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కో నిర్ణయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 19వేల పైచిలుకు ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 8వేలకు దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే 2025 నాటికి 2500 మందికి వీఆర్ఎస్ పేరుతో ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందన్న చర్చ కార్మికవర్గాల్లో నడుస్తోంది. ఇందుకోసం రూ.1260కోట్లు సిద్దం చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. నాగర్‌నార్ స్టీల్ ప్లాంట్ లో సాంకేతికంగా అనుభవజ్ఞులైన కార్మికులు లేరని విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కార్మికులను పంపించాలని కేంద్రం కోరిన వెంటనే 500 మందిని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం డిప్యుటేషన్‌పై పంపించి వేయాలని నిర్ణయించడం చూస్తే కార్మికుల్లో అనుమానాలకు బలం చేకూరుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు