Monday, 02 December 2024 02:14:47 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Liquor: పోలీసులు మద్యం బాటిళ్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే.. ఎత్తుకెళ్లిన మందుబాబులు..

Date : 11 September 2024 02:07 PM Views : 46

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మద్యం బాటిళ్లను వాహనంతో తొక్కించే ప్రయత్నం చేస్తున్న పోలీసులకు మందుబాబులు షాకిచ్చారు. పోలీసులను తోసేసి మరీ బాటిళ్లు ఎత్తుకుపోయారు. వారు ఆపుతున్నప్పటికీ లెక్కచేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరులో జరిగిందీ ఘటన. వివిధ కేసుల్లో పోలీసులు దాదాపు రూ. 50 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డుకు వాటిని తరలించారు. అనంతరం అక్కడ వాటిని ఒక వరుస క్రమంలో పేర్చగా అప్పుడే ఊహించని ఘటన జరిగింది. ఆ బాటిళ్లను చేజిక్కించుకునేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. ఒక్కసారిగా బాటిళ్ల కోసం ఎగబడడంతో గందరగోళం నెలకొంది. కొందరు మందుబాబులు దొరికిన వాటిని దొరికినట్టు ఎత్తుకెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొందరు బాటిళ్లు చేజిక్కించుకుని వెళ్లిపోయారు. అప్రమత్తమైన పోలీసులు కొందరి నుంచి బాటిళ్లు తిరిగి లాక్కోగా, కొందరు మాత్రం అప్పటికే పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు