Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి.. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన రూ.50 లక్షలు, తన కుమారుడు రాంచరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి... శాలువాతో చిరును సత్కరించారు. మరోవైపు, సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలలోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ మొత్తాన్ని బాధితులకు అందేలా చేస్తూ వారిని ఆదుకుంటున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అమర్ రాజా గ్రూప్ తరఫున రూ.కోటి, నటులు విష్వక్సేన్ రూ.10 లక్షలు, సాయి దుర్గ తేజ్ రూ.10 లక్షలు, అలీ రూ. 3 లక్షలు అందజేశారు. రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించి, ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను సీఎంలకు అందజేశారు.
Admin
Studio18 News