Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడలో ఇవాళ మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో జగన్ తీసుకువచ్చిన రేషన్ వాహనాలు ఈ కార్యక్రమలో పాలుపంచుకుంటున్నాయి. దీనిపై వైసీపీ నేత రోజా స్పందించారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు... జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ...జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు... జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ... జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్... జగనన్న హయాంలో కొనుగోలు చేసిన 108, 104 వాహనాలు... జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు... జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు... ఈరోజు విజయవాడ ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు విజయవాడ రోడ్లపై బారులు తీరిన రేషన్ వాహనాల వీడియోలను రోజా పంచుకున్నారు.
Admin
Studio18 News