Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. తాడిపత్రిలో వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే... నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని... ఇంతకన్నా సిగ్గులేనితనం ఏముంటుందని జగన్ ధ్వజమెత్తారు.
Admin
Studio18 News