Monday, 02 December 2024 03:56:30 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి షాకిచ్చిన జీవీఎంసీ అధికారులు

Date : 04 September 2024 03:08 PM Views : 80

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ అధికారులు షాకిచ్చారు. భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్దంగా నేహారెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళిక అధికారి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుండి బీచ్ ఒడ్డున హోటల్ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్స్, గోడలు ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భీమిలి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూల్చివేతలను ఎవరూ అడ్డుకోకపోవడంతో సజావుగా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడి అక్రమ నిర్మాణాలు కూల్చివేత పనులు ఈ సాయంత్రం వరకూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలపై జనసేన నేత మూర్తి యాదవ్, మరి కొందరు కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేహారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ జడ్జి ధర్మాసనం ..ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. మరోపక్క అక్రమ నిర్మాణాలను తొలగించడం లేదంటూ ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ను పిటిషనర్లు ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో కోర్టు స్టే లేనప్పుడు అధికారులు అక్రమ నిర్మాణాలను నిబంధనల ప్రకారం తొలగించవద్దని హైకోర్టు తెలిపింది. దీంతో అధికారులు ఈరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు