Monday, 02 December 2024 01:53:38 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AP Farmers: వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి రూ.36 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ

Date : 09 August 2024 12:58 PM Views : 40

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ-క్రాపింగ్ కింద నమోదు చేయాలి ఆదేశించారు. డ్రోన్ల వినియోగాన్ని పెంచాలి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 140 డ్రోన్లను మాత్రమే వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరవు ప్రాంతాల్లో మాయిశ్చర్‌ను ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మైక్రో ఇరిగేషన్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలోనే ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి లబ్ధిదారులను గుర్తించేందుకు మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసేలా జియో ట్యాగ్ చేయాలని చంద్రబాబు సూచించారు. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. ఈ ఉత్పత్తుల ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవలను అందించేలా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు