Studio18 News - ANDHRA PRADESH / : Ganta Srinivasa Rao : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ హత్యలు, దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు జగన్. అంతేకాదు ఏపీలో శాంతిభద్రతలు లేనందున.. రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీ నుంచి అధికార పార్టీలోకి చేరికలు.. రాజకీయాలను మరింత వేడెక్కించాయి. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒకేసారి 14మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొందరు కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బాంబు పేల్చారు. తాము గేట్లు గెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని తెలిపారు. కార్పొరేటర్లు మాత్రమే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాస రావు చెప్పారు. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రవర్తన నచ్చకనే చాలామంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కేవలం కార్పొరేటర్లే కాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అటు కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీకి మేయర్ పీఠం చేజారే అవకాశం ఉంది.
Admin
Studio18 News