Friday, 13 December 2024 08:45:29 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CM Chandrababu: చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్

Date : 13 September 2024 01:56 PM Views : 45

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లో వంద కోట్ల రూపాయలను చిన్న పరిశ్రమలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధికి రూ.900 కోట్లు అందుతాయని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడానికి, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా టీసీఎస్ రూపొందిస్తున్న ఎంఎస్ఎంఈ వన్ యాప్ ను రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిన్న పరిశ్రమల కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు ఎంఎస్ఎంఈ పార్కుల చొప్పున 50 పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల డేటా బ్యాంక్ కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (రాంప్) కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో టెక్నాలజీ సెంటర్ ను కొప్పర్తికి మార్చారని, దాన్ని తిరిగి అమరావతికి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికన డెవలప్‌మెంట్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) కార్యాలయం హైదరాబాద్ లో ఉండటంతో ఎంఎస్ఎంఈలకు అనుమతుల కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తోందని, అందుకే విజయవాడలో డీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు