Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Andhra Cricket Association: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్ లో అధ్యక్షుడిగా ఎంపి కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం శుభపరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత తొలి నిర్ణయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం వరద బాధితులకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో వసతులతో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి నైపుణ్యంఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొస్తామని కేశినేని శివనాథ్ అన్నారు. ఇప్పటి వరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు వేదికగా ఉంది. ఇకపై మంగళగిరి, కడప ప్రాంతాల్లో కూడా అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగేలా కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివ నాథ్ తెలిపారు.
Admin
Studio18 News