Sunday, 08 March 2026 03:43:47 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Date : 13 August 2024 10:59 AM Views : 468

Studio18 News - ANDHRA PRADESH / : Jogi Ramesh Son Arrest : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేశారు. 15మంది అధికారులు తెల్లవారు జామున 5గంటల నుంచి సోదాలు చేపట్టారు. కొద్దిగంటలకే జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ.. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ అన్నారు. కుమారుడు రాజీవ్ అరెస్ట్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. నేను, నా కుటుంబం అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఏదైనా తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డులో ఉరేసుకుంటాం. బలహీన వర్గాలకు చెందిన మమ్మల్ని వేధించడం.. ఇది న్యాయమా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశ్నించారు. నా కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే పైన దేవుడున్నారు. మీరు మమ్మల్ని తొక్కొచ్చు.. మాపై కేసులు పెట్టొచ్చు.. రెడ్ బుక్ తీయొచ్చు. మీరు ఇంత దుర్మార్గంగా ఏమీ తెలియని కుర్రాడిపై కేసుపెట్టి జైల్లో పెట్టాలన్న వంకర బుద్దిని మార్చుకోవాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :