Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఆయన భార్య దువ్వాడ వాణి మద్దతుదారులు చేరుకున్నారు. దువ్వాడ శ్రీను డైవర్స్ ఇస్తాననడంపై పలువురు మహిళలు మండిపడుతున్నారు. ఇరువురూ కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోవైపు, దువ్వాడ వాణి తండ్రి సంపతి రాఘవరావు 10 టీవీతో మాట్లాడుతూ.. తన కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. అనేక సార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశానని, దువ్వాడ శ్రీను వినడంలేదని తెలిపారు. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మాట్లాడటానికి కూడా దువ్వాడ దొరకడంలేదని చెప్పారు. ఆయనను హత్య చేయడానికి తన కూతురేమైనా బాడీ బిల్డరా అని ప్రశ్నించారు. తానే వారికి ఆస్తులు ఇచ్చానని, వారిద్దరూ కలిసి ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు ఆక్ష్న భార్య వాణి, కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతోంది. పోలిస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. డైవర్స్ నోటీసు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి అంటున్నారు.
Admin
Studio18 News