Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మాచర్ల మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు వారం కిందటే రాజీనామా చేయగా... వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావును నేడు చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో పోలూరు నరసింహారావు చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. పోలూరు నరసింహారావు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉండగా... ఇటీవలే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో టీడీపీకి ఎదురులేకుండా పోయింది.
Admin
Studio18 News