Monday, 02 December 2024 12:36:11 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Annamaya district: అన్నమయ్య జిల్లాలో దారుణం .. గ్యాస్ సిలెండర్ పేలి ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి

Date : 17 August 2024 12:28 PM Views : 90

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో వివాహిత, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కొత్తపేటలోని తోగట వీధిలో గల ఓ ఇంటిలో గ్యాస్ సిలెండర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లక్కిరెడ్డిపల్లి మండలం ఎర్రగుడికి చెందిన రమాదేవి (34), ఇద్దరు పిల్లలు మనోహర్ (8), మన్విత (5) మృతి చెందారు. రాయచోటి డీఎస్పీ రామచంద్రయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో సీసీ కెమెరా పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన రమాదేవి భర్త రాజు జీవనాధారం కోసం కువైట్ లో ఉంటున్నాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. ప్రమాదంలో తల్లి సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందడం స్థానికుల హృదయాలను కలచివేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు